
సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సాహితీ ఇన్ ఫ్రా స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మంగళవారం (ఆగస్టు 25) ఈ స్యామ్ లో డైరెక్టర్ పూర్ణచంద్రరావును అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కస్టమర్లను నిండా ముంచిన సాహితీ డైరెక్టర్ను అరెస్టు చేయడంతో కేసులో పురోగతి సాధించింది ఈడీ.
సాహితీ ఇన్ ఫ్రా 700 మంది కస్టమర్ల నుంచి 800 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. ఫ్రీలాంచ్ విల్లా, ఫ్లాట్ల పేరుతో భారీ మోసానికి తెరలేపింది సాహితీ సంస్థ. సాహితీ పేరుతో వసూలు చేసిన డబ్బులు మొత్తం రూ.120 కోట్లను డైరెక్టర్ పూర్ణచందర్ మళ్లించినట్లు తెలుస్తోంది.
సాహితీ లక్ష్మీనారాయణ తో కలిసి 216 కోట్ల రూపాయలను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. 50 కోట్ల రూపాయలను హవాల రూపంలో మళ్లించారని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.
సాహితీ ఇన్ ఫ్రా సంస్థ రూ.126 కోట్లతో 21 ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 161 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. లేటెస్ట్ గా డైరెక్టర్ ను అరెస్టు చేయడంతో మరిన్ని ఆధారాలు సేకరించనుంది ఈడీ.