బడ్జెట్ అప్‌‌డేట్స్: మంచినీటి పథకానికి రూ.87 వేల కోట్లు

బడ్జెట్ అప్‌‌డేట్స్: మంచినీటి పథకానికి రూ.87 వేల కోట్లు

దేశంలో ఇప్పటికీ మంచినీటి కొరత ఉంది. దాన్ని తగ్గించే దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఈసారి బడ్జెట్‌లో రక్షిత మంచినీటి పథకానికి రూ.87 వేల కోట్లు కేటాయించారు.

ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈసారి బడ్జెట్‌ను డిజిటల్‌గా ప్రవేశపెట్టారు. బండెడు బడ్జెట్ పుస్తకాలకు బదులుగా.. అంతా ఆన్ లైన్‌లోనే.. అదికూడా ఒక యాప్‌లోనే రిలీజ్ చేశారు. దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలకు ఇది వరుసగా మూడోసారి కాగా.. మోడీ ప్రభుత్వానికి తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. కరోనా వల్ల దేశ ఎకానమీ మొత్తం గాడితప్పింది. కరోనా తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో దేశం యావత్తు బడ్జెట్ మీద ఆశలు పెట్టుకుంది.

ముఖ్యాంశాలు

మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్స్ పార్కులను అభివృద్ధి చేస్తాం.

రక్షిత మంచినీటి పథకానికి రూ.87 వేల కోట్లు.

జిల్లాకో హెల్త్ ల్యాబ్.

15 ఎమర్జెన్సీ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటు.

జలజీవన్ మిషన్‌కు రూ. 2.87 లక్షల కోట్లు.

వాయుకాలుష్యం నివారణకు రూ.2,217 కోట్లు.

మార్చి 22 కల్లా 8,500 కిలోమీటర్ల అదనపు హైవేలు.

మెట్రో, బస్ స్టాప్‌ల నిర్మాణానికి రూ. 18 వేల కోట్లు.

రైల్వేశాఖ అభివృద్దికి రూ. 1.15 లక్షల కోట్లు.