
సీఎం కేసీఆర్ పాలనలో కులానికో న్యాయం జరుగుతుందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఏప్రిల్ లో మియాపూర్ పీఎస్ లో జరిగిన ACB దాడిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని జైలుకు పంపించిండ్రు.. కానీ లంచం తీసుకొని రమ్మని పురమాయించిన SI యాదగిరిరావును ఎందుకు జైలుకు పంపించలేదని ప్రశ్నించారు. జైలుకు పంపడానికి ACB వాళ్లకు దమ్ము సరిపోలేదన్నారు. ఎందుకంటే దీని వెనుక సీఎంఓ ఉందని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .
ఇటీవల డిస్మిస్ అయిన TaskForce Inspector Nageshwar Rao గురించి ఎవరూ మాట్లాడలేదని.. ఎందుకంటే అతనిది పేద రజక కులం అని అన్నారు. నయీం కేసుల్లో దందాలు చేసి కోట్లు సంపాదించుకున్న ఎంతమంది అగ్రవర్ణాలకు చెందిన అధికారులు ఇప్పుడు రాజుల్లాగా ఫాంహౌసులు కట్టుకొని ఉన్నారని అన్నారు. వీటికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని... సరైన సమయంలో బయట పెడతానని హెచ్చరించారు.