కవిత కేసులో ఆలస్యమెందుకు?: కేసీఆర్ ను ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్

కవిత కేసులో ఆలస్యమెందుకు?: కేసీఆర్ ను ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రతి అంశం గురిచి గంటల తరబడి పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడే  సీఎం కేసీఆర్​ లిక్కర్ స్కాం పై ఎందుకు పెదవి విప్పడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో పులి బిడ్డలని ప్రశంసించిన సీఎం లిక్కర్ స్కాంలో కూతురిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం సిటీలో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న విలేకరులతో మాట్లాడారు. వందలకోట్ల అవినీతి జరిగిన కేసులో సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. 

చిన్న చిన్న కేసులకు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారులు..కవిత కేసులో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలు కూడా దొరకకుండా మొబైల్ ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోపక్క బీజేపీకి చెందిన బీఎల్​ సంతోష్ రూ.వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. బీఎస్పీ లీడర్లు అల్లిక వెంకటేశ్వర్లు, కర్రీ కృష్ణ పాల్గొన్నారు.