సోమేశ్ ఏం ఐడియాలు ఇస్తడని అడ్వైజర్ గా పెట్టుకున్నవ్: RS ప్రవీణ్ కుమార్

సోమేశ్ ఏం ఐడియాలు ఇస్తడని అడ్వైజర్ గా పెట్టుకున్నవ్: RS ప్రవీణ్ కుమార్

సీఎం సలహాదారుడిగా సోమేశ్ కుమార్ ను నియమించడంపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇపుడున్న ఐఏఎస్ ల కంటే సోమేశ్ కుమార్  ఏం గొప్ప ఐడియాలు ఇస్తాడని చీఫ్ అడ్వైజర్ గా నియమించారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో లక్షలాది రైతుల నోట్లో మట్టిగొట్టి ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిన సోమేశ్ కుమార్ ను ఎందుకు సలహాదారుడిగా పెట్టుకున్నారో  చెప్పాలన్నారు.

ఇప్పటికే ప్రభుత్వంలో అడ్వైజర్ గా రాజీవ్ శర్మ ఉన్నారని.. ఇంకెందర్ని  అడ్వజర్ లుగా నియమిస్తారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అడ్వైజర్లు, చీఫ్ అడ్వైజర్లతోనే పాలన సాగిస్తారా అనిప్రశ్నించారు. అడ్వైజర్లలో ఎంత మంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  ప్రభుత్వంలో ఉన్న 13, 14 మంది అడ్వైజర్లు ఏం పనిచేస్తున్నారో వారికి ఏడిపార్ట్ మెంట్ అప్పగించారో ప్రజలకు  చెప్పాలన్నారు.

మాజీ సీఎస్  సోమేష్ కుమార్ కు మే9 వ తేదిన సీఎం కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టారు. తన ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమేష్ కుమార్ ప్రభుత్వ సలహాదారు పోస్టులో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. 

ప్రభుత్వ సర్వీసు నుంచి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక ప్రచారాలు సాగాయి. బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం కూడా జరిగింది.  అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ ..తన ముఖ్యసలహాదారుగా నియమించుకోవడం విశేషం.

https://www.youtube.com/watch?v=8QVYuCvx-cI