కేసీఆర్ ను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ ను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ప్రస్తుతం సోమాజిగూడ ఆస్పత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో  డిసెంబర్ 11వ తేదీ సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను కలిసి పరామర్శించారు. తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని.. ప్రజా సమస్యలపై మాట్లాడాలని  ఆయనను కోరినట్లు చెప్పారు. మళ్లీ ప్రజల్లో తిరగాలని కో ఇటీవల ఎర్రవల్లిలోని ఫాంహౌస్ బాత్ రూమ్ లో కేసీఆర్ కాలుజారి కిందపడడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటినా సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యుల బృందం.. తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు.

  శస్త్ర చికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారు. ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. కేసీఆర్ గాపడడంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించి.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. నిన్న (డిసెంబర్ 10) సీఎం రేవంత్ రెడ్డి..ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన విషయం తెలసిందే.