నిరుద్యోగులు మరోసారి మోసపోవద్దు

నిరుద్యోగులు మరోసారి మోసపోవద్దు

హైదరాబాద్: నిరుద్యోగులు మరోసారి మోసపోవద్దని రాష్ట్ర బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియకు డెడ్లైన్ లేకుండా కేవలం ఎన్నికల స్టంట్గా తీసుకొచ్చి.. మరోసారి మోసం చేయడానికి పాలకులు సిద్ధమయ్యారని చెప్పారు. ఎప్పటివరకు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పే దమ్ము ఉందా అంటూ కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో 11 ఏండ్ల నుంచి గ్రూప్–1 నోటిఫికేషన్ వేయలేదు. కాబట్టి పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితిని  కనీసం 3 నుంచి 5 సంవత్సరాలకు పెంచాలి. అదేవిధంగా డీఎస్పీ జాబ్స్కు కనీస ఎత్తు 167.7 సె.మీ.ల నుంచి 165 సెంటీమీటర్లకు తగ్గించాలి. యూపీఎస్సీలో ఐపీఎస్లకూ 165 సెంటీమీటర్లే కదా? 21వ శతాబ్దంలో, టెక్నాలజీ యుగంలో కూడా ప్రాచీన కొలమానాలు ఎందుకు’ అని ప్రవీణ్ కుమార్ క్వశ్చన్ చేశారు.

మరిన్ని వార్తల కోసం:

ఖైదీలకు సుశీల్ కుమార్ రెజ్లింగ్ పాఠాలు

రేవంత్​కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?

ఉక్రెయిన్​పై విరుచుకుపడుతున్న రష్యా