వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలె : ట్వీట్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ 

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలె : ట్వీట్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ 

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఉందంటూ బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘‘కర్నాటకలో పోలీసు రిక్రూట్ మెంట్ కుంభకోణంలో పీకల దాక కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినప్పుడు.. తెలంగాణలో ఏకంగా 16 పేపర్లు లీక్ చేసిన TSPSC వెనకాల ఉన్న  బీఆర్ఎస్ పార్టీని కూడా రాబోయే ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉందా..? లేదా..?. దయచేసి మీ అభిప్రాయం చెప్పి తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కాపాడండి’’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

https://twitter.com/RSPraveenSwaero/status/1658072035451387906