
TSPSC చైర్మన్ డా. జనార్థన్ రెడ్డి రాజీనామాపై బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ స్పందించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ డా.జనార్థన్ రెడ్డి రాజీనామాను స్వాగతిస్తున్నాం..మిగతా సభ్యులు కూడా వెంటనే రాజీనామాచేయాలి. ఈ పని మార్చి నెలలో చేసి ఉంటే బాగుండేది.. అసలు నిజాలు ప్రజలకు తెలిసేవి అన్నారు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ప్రవళిక లాంటి నిరుద్యోగుల విలువైన ప్రాణాలు పోయేవి కావు అని అన్నారు.
టీఎస్ పీఎస్సీలో పేపర్ లీకేజీలపై గతంలో జరిగిన సిట్ ఇన్వెస్టిగేషన్ అంతా అసలు నిందితులనురక్షించేందుకు జరిగిందన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. దీనిపై పూర్తిస్థాయి సమీక్ష జరపాలని నిరుద్యో్గుల తరపున బీఎస్పీ కోరుతుందన్నారు.
ఈసారైనా నీతికి , నిజాయితీకి , చక్కటి పరిపాలన దక్షతకు మారుపేరైన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా సభ్యులుగా నియమించాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) ఛైర్మన్ డా. జనార్ధన్ రెడ్డి రాజీనామాను స్వాగతిస్తున్నా. మిగతా సభ్యులు కూడా వెంటనే రాజీనామా చేయాలి. ఈ పని మార్చి నెల లోనే చేసుంటే బాగుంటుండె. అసలు నిజాలు ప్రజలకు తెలిసేవి. ప్రవళిక లాంటి నిరుద్యోగుల విలువైన ప్రాణాలు పోయేవి కావు.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 11, 2023
అదే విధంగా…