హైదరాబాద్​లో రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్​  చేస్తం

హైదరాబాద్​లో రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్​  చేస్తం

హైదరాబాద్:  గ్లోబల్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్  దజో  భారతదేశంలో తన  మొదటి డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌ను హైదరాబాద్​లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దజో గ్రూప్ సీఈఓ షే సెగేవ్ మాట్లాడుతూ  రూ.200 కోట్ల ప్రారంభ పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్​లో సుమారు  రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడించారు.

ఈ సంవత్సరం చివరి నాటికి, ఉద్యోగుల సంఖ్యను వెయ్యికి పెంచుతామని వెల్లడించారు.  2024 డిసెంబరు నాటికి ఉద్యోగుల సంఖ్య 2500కి పెరుగుతుందన్నారు.   దజో గ్రూప్ ఐదు కేంద్రాల్లో 3,000 మంది పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 మార్కెట్లలో నంబర్​వన్​ అయిన ఈ కంపెనీ యునైటెడ్ కింగ్‌‌‌‌డమ్​తోపాటు  ఇతర మార్కెట్‌‌‌‌లలో  ఐపీఎల్ ప్రసార హక్కులను పొందింది.  

స్ట్రీమింగ్ యాప్‌‌‌‌తో పాటు, దజో ఇంటరాక్టివ్ యాప్‌‌‌‌ను కూడా రూపొందిస్తున్నామని, వివిధ స్పోర్ట్స్​ ఈవెంట్‌‌‌‌లకు టిక్కెట్లు, మెర్చండైజ్ ​ కొనుగోలు చేయవచ్చని,  ఆన్‌‌‌‌లైన్ గేమ్‌‌‌‌లు ఆడవచ్చని సీఈఓ వివరించారు.  దజో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సందీప్ టికు మాట్లాడుతూ హైదరాబాద్​ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్... యాప్ డెవలప్‌‌‌‌మెంట్, ఇంటరాక్టివ్ ఎక్స్​పీరియెన్సెస్​, డేటా అనలిటిక్స్​పై పోకస్​ చేస్తుందని అన్నారు.