
హైదరాబాద్, వెలుగు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ నెల 16న హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ తార్నాకలో కొత్తగా నిర్మించిన ఏబీవీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన వస్తున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. సాయంత్రం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగే సంఘ్ ప్రోగ్రామ్‌లో కూడా ఆయన పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు కలిసే అవకాశం ఉంది.