- గ్రేటర్లో నాలుగో రోజూ ఆర్టీఏ తనిఖీలు
- 49 కేసులు నమోదు, రూ. 1.49 లక్షల జరిమానా
హైదరాబాద్‌సిటీ, వెలుగు:ప్రైవేట్బస్సుల ఆపరేటర్లు ప్రయాణీకుల నుంచి ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారన్న విషయం ఆర్టీఏ తనిఖీల్లో బయటపడుతూనే ఉన్నది. ప్రయాణీకులు కూర్చుని ప్రయాణించే సీటును కూడా స్లీప్ సీటుగా మార్చిన వైనాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. నాలుగో రోజైన మంగళవారం నాగోల్ వద్ద జరిగిన తనిఖీలో 5 బస్సులు ఇలా సీట్టింగ్సీటును స్లీపర్సీటుగా కన్వర్ట్చేసినట్టు అధికారులు గుర్తించారు.
వీరిపై అధికారులు కేసులు నమోదు చేసి, రూ.15 వేల జరిమానా విధించారు. అలాగే హైదరాబాద్సెంట్రల్జోన్పరిధిలో ఫైర్‌సేఫ్టీలేని, ఫస్ట్ఎయిడ్బాక్స్లేని 4 బస్సులపై కేసు నమోదు చేసి రూ. 17 వేల జరిమానా విధించారు. ఈస్ట్జోన్పరిధిలో 3 బస్సులకు ఫైర్‌సేఫ్టీ లేకపోవడంతో పాటు కమర్షియల్గూడ్స్ను తరలిస్తున్నట్టు గుర్తించి కేసులతోపాటు రూ.13 వేల జరిమానా విధించారు.
వెస్ట్జోన్పరిధిలో 7 బస్సులు టాక్స్చెల్లించక పోవడం, ఫిట్‌నెస్‌లేని 7 బస్సులపై కేసు నమోదు చేసి రూ.17 వేల జరిమానా విధించారు. నార్త్‌జోన్‌లో 7 బస్సుల నిర్వాహకులు అనధికారికంగా బస్సును ఆల్ట్రేషన్ చేయడంతో పాటు, ఫైర్‌సేఫ్టీ లేకపోవడం, కమర్షియల్ గూడ్స్ తరలించడం, ప్యాసింజర్స్లిస్ట్లేని కారణంగా కేసులు నమోదు చేసిన అధికారులు.. వీరి నుంచి రూ.12 వేల జరిమానా వసూలు చేశారు.
అలాగే సౌత్‌జోన్ పరిధిలో ఫైర్‌సేఫ్టీ లేక పోవడం, కమర్షియల్ గూడ్స్ తరలిస్తున్న 10 బస్సులపై కేసు నమోదుతోపాటు రూ. 25 వేల జరిమానా విధించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్యాసింజర్స్లిస్ట్ లేని, కమర్షియల్ గూడ్స్ తరలిస్తున్న 6 బస్సులపై కేసు నమోదు చేసి 15వేల జరిమానా విధించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో బస్సులో సెకండ్డ్రైవర్లేక పోవడం, లైసెన్స్‌లేని, కమర్షియల్ గూడ్స్ తరలిస్తున్న 7 బస్సుల పై కేసు నమోదు చేశారు.
గత నాలుగు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో మొత్తం 192 కేసులు నమోదు చేసి రూ.4.55 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 8 బస్సులను సీజ్ చేశామన్నారు.
