మణికొండ RTA ఆఫీస్.. మీడియేటర్ లేనిదే జరగని పనులు.. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు ఫిక్స్ !

మణికొండ RTA ఆఫీస్.. మీడియేటర్ లేనిదే జరగని పనులు..  ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు ఫిక్స్ !

మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలోని RTA కార్యాలయం దళారులకు అడ్డాగా మారింది. RTA సేవల కోసం దళారులను ఆశ్రయించవద్దని బోర్డులు పెట్టుకున్న అధికారులు దానిని మాత్రం పాటించడం లేదు. దళారుల ప్రమేయం లేనిది ఏ ఒక్క పని కావడం లేదంటే ఇక్కడ ఎంతగా అధికారులు, దళారుల మధ్య సయోధ్య ఉందో ఇట్టే అర్థమవుతుంది. 

మణికొండ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వారంతా ఉన్నత ఉద్యోగులు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్న వారే అధికంగా ఉంటారు.

వారు ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని లైసెన్స్ లతోపాటు రెన్యువల్ వాహన రిజిస్ట్రేషన్ కోసం  ఇక్కడికి వస్తున్నారు. కానీ వారిని అధికారులు ఆపత్రాలు లేవు.. ఈ పత్రాలు లేవు అంటూ రోజుల తరబడి తిప్పుతున్నారు. అదే దళారులను ఆశ్రయిస్తే రెండు మూడు గంటల్లో పని పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల స్పందించి  తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.