శ్రీశైలం డ్యాం వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

శ్రీశైలం డ్యాం వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

శ్రీశైలం డ్యాం వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్నగర్ వెళ్తున్న బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. గోడకు ముందు ఉన్న ఇనుప రాడ్ల వల్ల బస్సు అక్కడే నిలిచిపోయింది. దీంతో బస్సులు ఉన్నవారంత ఊపిరి పీల్చుకున్నారు.