జేబీఎస్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం

జేబీఎస్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‎లోని జూబ్లీ బస్ స్టేషన్(జేబీఎస్) వద్ద బుధవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాండ్​నుంచి అతివేగంగా బయటకు వచ్చి అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికుల పైకి దూసుకెళ్లింది. దీంతో కార్ఖానా వైపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు శివ బైక్‌‌‌‌‌‌‌‌తో సహా బస్సు టైర్ల మధ్య ఇరుక్కుపోయాడు. 

గమనించిన మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు క్రేన్‌‌‌‌‌‌‌‌ను రప్పించి, బస్సును పక్కకు జరిపి శివను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయాలడంతో హాస్పిటల్​కు తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు  పేర్కొన్నారు.