
మేడ్చల్: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మరణించిన సంఘటన గురువారం ఉదయం మేడ్చల్ జిల్లా, ఉప్పల్ లో జరిగింది. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న రామంతాపూర్ కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని రామావత్ హరినాయక్(38)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని గాంధీ హస్పిటల్ కి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్ల తెలిపారు పోలీసులు.