జీవితాలతో ఆట: బస్సు టైరుకు నట్లు బిగించకపోవడంతో రన్నింగ్ లో ఊడింది

జీవితాలతో ఆట: బస్సు టైరుకు నట్లు బిగించకపోవడంతో రన్నింగ్ లో ఊడింది

రెండు రోజుల క్రితమే బస్సు టైర్ పంక్చర్.. అయినా నడిపారు

రన్నింగ్ లో బస్సు టైరు ఊడింది…

కార్మికులు లేరని టైరు నట్లు బిగించలేదట… డిపో మేనేజర్ వివరణ

కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు టైరు ఉడిపోయింది. ఈ ఘటన బోయిన్ పల్లి మండలం వెంకట్రావు పల్లి రోడ్డులో జరిగింది. బస్సు టైరు ఊడిపోగానే తాత్కాలిక డ్రైవర్ బస్సును పక్కకు ఆపేశాడు. దీంతో ప్రమాదం తప్పింది. బస్సులో 35మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వహిస్తే భారీ ప్రమాదం జరిగేది. బస్సులో ఉన్న ప్రయాణికులను… వేరే బస్సులోకి ఎక్కించారు.

సిరిసిల్లా డిపో మేనేజర్ ను వివరణ కోరగా… రెండురోజులక్రితమే బస్సు వెనక టైర్ పంక్చర్ అయిందని చెప్పారు.  బస్సు బయలుదేరేముందు నట్టులను గట్టిగా బిగించాల్సి ఉన్నప్పటికీ కార్మికులు సమ్మెలో ఉండటంతో  వీలుకాలేదని చెప్పారు. తాత్కాలిక డ్రైవర్ బస్సును అలాగే తీసుకెళ్లాడని తెలిపారు. కార్మికులు అందుబాటులో లేకపోవడంతో తమనే బస్సుకు నట్లు బిగించుకొని రావాలని మేనేజర్ చెప్పారని తాత్కాలిక డ్రైవర్ అన్నారు.