ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూపులు

ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూపులు

సిటీ రోడ్లపై వింత పరిస్థితి
ఎండలోనే బస్సుల కోసం  ప్రయాణికుల ఎదురుచూపులు
పెరుగుతున్న టెంపరేచర్లతో మరిన్ని తిప్పలు

హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్లపై వింత పరిస్థితి నెలకొంది. బస్​షెల్టర్లు ఉన్నచోట ఆర్టీసీ బస్సులు ఆగట్లేదు. ఆగేచోట షెల్టర్లు ఉండట్లేదు. మరి కొన్నిచోట్ల అసలే లేని పరిస్థితి. కాలమేదైనా ప్రయాణికులు రోడ్లపైనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ట్రాఫిక్​ఎక్కువగా ఉండే రోడ్లపై గంటలు గంటలు వేచి ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు. ఎండా కాలంలో మరింత దారుణంగా ఉంటోందని చెబుతున్నారు. కొన్నిచోట్ల రోడ్ల వైడనింగ్​లో భాగంగా బస్​షెల్టర్లను తొలగించారని, తిరిగి ఏర్పాటు చేయలేదని అంటున్నారు. ఆర్టీసీకి, జీహెచ్ఎంసీకి మధ్య కోఆర్డినేషన్​లేకపోవడంతోనే ఈ సమస్య ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం జనాలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఎట్లా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఎండకు, వానకు నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
యాడ్స్​కే పరిమితం
సిటీ వ్యాప్తంగా దాదాపు వెయ్యి బస్టాపులు ఉన్నాయి. వాటిలో 800 స్టాప్​లను యాడ్ ఏజెన్సీలకు అప్పగించారు. కొన్ని మినహా మిగతావన్నీ నామ్ కే వాస్తే అన్నట్లుగా ఉన్నాయి. కూకట్​పల్లి, జేఎన్టీయూ, దిల్​సుఖ్​నగర్, షేక్ పేట్, ఫిల్మ్​నగర్​దర్గా రోడ్, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ ఇలా అనేక చోట్ల బస్​షెల్టర్లు లేనేలేవు. ఫుట్​పాత్‌‌‌‌లను ఆక్ర
మించి షాపులు ఏర్పాటు చేసుకోవడంతో కొన్ని
చోట్ల రోడ్ల మీదనే పడిగాపులు కాస్తున్నామని 
ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు యాడ్​ఏజెన్సీలకు అప్పగించిన షెల్టర్లు ప్రకటనలకు తప్పితే ప్రయాణికులకు ఉపయోగపడట్లేదు. ఉన్న షెల్టర్లలో కూర్చునేందుకు బెంచీలు లేవు. కొన్నిచోట్ల ఫుట్ పాత్ కోసం ఇనుప గ్రిల్స్​పెట్టడంతో ఉన్నవాటిని వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఏసీ బస్‌‌‌‌స్టాపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటిల్లో సరైన సౌకర్యాలు లేక జనం బయటే నిల్చుంటున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆడవాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. గంటల తరబడి రోడ్డుపై బస్ కోసం నిలబడితే అటుగా పోయేవారు అదోరకంగా చూస్తున్నారని, బస్‌‌‌‌ షెల్టర్​ఉంటే ఆ పరిస్థితి ఉండదని వాపోతున్నారు. బస్‌‌‌‌ షెల్టర్లలో సౌకర్యాలు, కొత్తవి ఏర్పాటు, ప్రయాణికుల అవస్థలపై బల్దియా అసి
స్టెంట్ ఇంజనీర్ కార్తీక్​ని సంప్రదించగా ‘రోడ్ వైడనింగ్​లో బస్‌‌‌‌స్టాపులను తీసేశారు. వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తాం. సిటీలో ఎక్కడెక్కడ సమస్య ఉంది మాకు తెలియదు. ఆర్టీసీ కూడా మా దృష్టికి తీసుకురాలేదు. బస్ డ్రైవర్లు గుర్తించి అవసరం ఉందని చెప్తే మేం పెడతాం’ అని చెప్పారు.