లాక్డౌన్ తర్వాత సిటీలో రోడ్డెక్కిన బస్సులు

లాక్డౌన్ తర్వాత సిటీలో రోడ్డెక్కిన బస్సులు

దేశంలోకి కరోనావైరస్ ఎంటర్ అవడం.. రోజురోజుకూ కరోనా కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దాంతో దాదాపు ఆరు నెలలుగా సిటీలో ఆర్టీసీ బస్ సర్వీసులు ఆగిపోయాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ రోజు నుంచి ఆర్టీసి సేవలను ప్రారంభించింది. సిటీలో బస్సులన్నింటిని ఒకేసారి కాకుండా.. అంచెలంచెలుగా బస్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా జిల్లా బస్సులు నడిపిన ప్రభుత్వం.. ఈ రోజు నుండి హైదరాబాద్ నగరంలో 25% బస్సులను ప్రారంభించింది. దాంతో ఈ రోజు నుంచి ప్రజలకు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. యాబై శాతం బస్సులు నడపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ డిపో నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు 50 బస్సులు నడుపుతున్నట్లు రాజేంద్రనగర్ డిపో మేనేజర్ తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి బస్సులు నడుపుతున్నామని ఆయన తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు ఈ యాబై బస్సులు హైదరాబాదు నగరంలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతాయని ఆయన తెలిపారు.

For More News..

సిటీలో మరో పరువు హత్య.. కూతురుని లవ్ మ్యారెజ్ చేసుకున్నాడని అల్లుడిని చంపించిన మామ

దేశంలో ఒక్కరోజే సుమారు 15 లక్షల కరోనా టెస్టులు

వారంలో రూ. 2,500 తగ్గిన గోల్డ్ ధర