రేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు?

రేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు?

ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ పై నేడు చర్చలు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య ఇంటర్‌‌ స్టేట్‌‌ అగ్రిమెంట్‌‌ కొలిక్కి వస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అన్నీ కుదిరితే ఈ నెల 22 నుంచి రెండు రాష్ట్రాల మధ్య బస్సులు రోడ్డెక్కనున్నాయి. రెండు రాష్ట్రాల అధికారులు టెలికాన్ఫరెన్స్‌‌ ద్వారా మాట్లాడినట్టు సమాచారం. తెలంగాణ పెట్టిన ప్రతిపాదనకు ఏపీ అంగీకరించినట్టు తెలిసింది. బుధవారం మరోసారి చర్చించి ఫైనల్‌‌ చేయనున్నారు. లాక్‌‌డౌన్‌‌ కారణంగా మార్చి 22వ తేదీ నుంచి ఇంటర్‌‌ స్టేట్‌‌ బస్సులు నడవడం లేదు. అన్‌‌లాక్‌‌లో భాగంగా కేంద్రం అనుమతిచ్చినా.. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కారణంగా బస్సు సర్వీసులు స్టార్ట్ కాలేదు.  గురువారం నుంచి రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడవనున్నట్టు సమాచారం. ఏపీతోపాటు బెంగళూరుకు కూడా బస్సులు స్టార్ట్ కానున్నాయి.

For More News..

కరోనా సోకి డ్యూటీకి రాని కాంట్రాక్ట్‌‌ ​లెక్చరర్లకు జీతం కట్​

ధరణిలో ఎక్కని ఆస్తులు 20 లక్షలు.. మంగళవారంతో ముగిసిన గడువు

అక్రమ కేసులతో బీజేపీ గెలుపును అడ్డుకోలేరు