నకిలీ ఆధార్ కార్డ్తో ప్లాట్స్ రిజిస్టేషన్స్.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్

నకిలీ ఆధార్ కార్డ్తో ప్లాట్స్ రిజిస్టేషన్స్.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్

భూములు కానీ, ఫ్లాట్స్ కానీ కొనేటప్పుడు డాక్యుమెంట్లు అన్ని పరిశీలించి కొనాలి. ఒక్కోసారి నకిలీ డాక్యుమెంట్స్ తో కొనుగోలు దారులకు రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకుంటారు కొందరు కేటుగాళ్లు.  తర్వాత కేసులంటూ కోర్టుల చుట్టు తిరగాల్సి ఉంటది. గతంలో ఇలాంటి ఘటనలు సంగారెడ్డి, మేడ్చల్,రంగారెడ్డి,హైదరాబాద్ లో చాలా జరిగాయి.  లేటెస్ట్ గా నకిలీ ఆధార్ కార్డ్ తో ప్లాట్స్ రిజిస్ట్రేషన్  చేసి ఓ కండక్టర్ ను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే..అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్ పూర్ కు గ్రామ రెవిన్యూ పరిధిలో ఉన్న రెండు ప్లాట్లను నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్టేషన్స్ చేసుకోవడానికి భాస్కర్ రెడ్డి ,శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లారు . నకిలీ ఆధార్ కార్డ్ తో ప్లాట్స్ రిజిస్టేషన్స్ కు యత్నించారు ఇద్దరు వ్యక్తులు. 

ALSO READ | Bellamkonda Sai Srinivas: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు.. రీజన్ ఇదే

అయితే  నకిలీ ఆధార్ కార్డ్ అని గుర్తించి  ఇద్దరి వ్యక్తులను పట్టుకొని అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ లో అప్పగించారు  సబ్ రిజిస్టర్.  సబ్ రిజిస్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నిందితులు  ఇద్దరిని అరెస్ట్ చేశారు . నిందితులు చంపాపేట్ కు చెందిన ఆర్టీసీ కండక్టర్ కోసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కురువ శ్రీనివాస్ లుగా గుర్తించారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.