Hyderabad : బేకరీల్లో వాడే ఫ్లేవర్స్ లో కెమికల్స్ వినియోగం

Hyderabad : బేకరీల్లో వాడే ఫ్లేవర్స్ లో కెమికల్స్ వినియోగం
  • రాజ్ ఫ్లేవర్స్ అండ్​ ఫ్రాగ్రాన్సెస్ ​షాప్​ సీజ్ 

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని రాజ్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రాన్సెస్ షాప్​ను జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. తపాడియా డయాగ్నోస్టిక్స్ బిల్డింగ్ లోని ఓ ఫ్లోర్ లో నిర్వాహకులు  బేకరీల్లో వాడే ఫ్లేవర్స్ తయారు చేస్తున్నారని తెలిపారు. 

కెమికల్స్ వాడుతున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో రైడ్ చేశామన్నారు. నిబంధనలు పాటించడం లేదని, ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ చెల్లించలేదని తేలిందని చెప్పారు. ఫ్లేవర్స్​లో సహజ రంగులకు బదులు కెమికల్స్ వాడుతున్నారని పేర్కొన్నారు. శాంపిల్స్​తీసుకొని ల్యాబ్​కు పంపించామని తెలిపారు.