- రెండేండ్ల కింద మృతిచెందిన భార్య
- అప్పటి నుంచి మనోవేదనతో భర్త అఘాయిత్యం
మెదక్ టౌన్, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్జిల్లాలో జరిగింది. హవేళీ ఘనపూర్ఎస్ఐ నరేశ్ తెలిపిన ప్రకారం.. మెదక్‌మున్సిపాలిటీ పరిధి ఔరంగాబాద్‌కు చెందిన ఎర్ర వెంకటి(50), నర్సాపూర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్. రెండేండ్ల కింద అతని భార్య చంద్రకళ చనిపోగా అప్పటినుంచి తీవ్ర మనో వేదన చెందుతున్నాడు.
గురువారం పాత లెప్రసీ ఆస్పత్రి వద్ద ఉన్న తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి కొడుకు లింగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. వెంకటి మృతదేహానికి మెదక్ఆర్టీసీ డీఎం సురేఖ, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.
