పాల వ్యాన్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి

V6 Velugu Posted on Dec 02, 2021

అల్వాల్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న పాల వ్యాను ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందాడు. కూకట్ పల్లికి చెందిన మాధవరెడ్డి.. హకీంపేట్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం గురువారం ఉదయం డిపోకు వెళ్తుూ.. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పాల వ్యాన్ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కార్మికుడు చనిపోవడంతో.. వ్యాన్ డ్రైవర్ ను శిక్షించాలని హకీంపేట్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పాల వ్యాను వేగంగా రావడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 

Tagged tsrtc, alwal, Milk van, Hakimpet, RTC driver, Driver Madhavareddy

Latest Videos

Subscribe Now

More News