
ఓయూ: ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులారా ఆత్మహత్యలు వద్దు,ఆత్మ గౌరవంతో పోరాడుదాం అంటూ గురువారం తెలంగాణ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద చనిపోయిన ఆర్టీసీ కార్మికులకు కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులు అర్పించారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీకి అశ్వత్థామ రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఐఎస్ ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు శంకర్, శ్రీనివాస్, పీడీఎస్యూ రంజిత్, శ్యామ్, టీఎస్ యూ కృష్ణ మాదిగ విద్యార్థులు పాల్గొన్నారు.