
ఆర్టీసీ జేఏసీ రేపు(మంగళవారం) తలపెట్టిన నిరాహార దీక్షను వాయిదా వేసుకుంది. మంగళవారం హైకోర్టులో విచారణ ఉన్నందున నిరాహార దీక్ష వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ చట్ట విరుద్ధమన్న ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించిందని తెలిపారు. రేపు రాత్రికి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో గాయపడిన మహిళలను గవర్నర్ తమిళి సై దగ్గరకు తీసుకెళ్తామని… గవర్నర్ అపాయింట్ మెంట్ కోరామని చెప్పారు అశ్వత్థామరెడ్డి.