ఆర్టీసీ లోగోను ఫైనల్​ చేయలేదు : సజ్జనార్

ఆర్టీసీ లోగోను ఫైనల్​ చేయలేదు : సజ్జనార్
  •     సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ సజ్జనార్
  •     ఫేక్ లోగో క్రియేట్ చేసినవారిపై కేసు నమోదు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్​ఆర్టీసీ) కొత్త లోగోపై సోషల్​మీడియాలో జరుతున్న ప్రచారంలో నిజం లేదని సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ సజ్జనార్​ తెలిపారు. అధికారికంగా ఇప్పటి వరకూ కొత్త లోగో ఫైనల్​ కాలేదని ఎక్స్ ద్వారా తెలియజేశారు. టీజీఎస్​ ఆర్టీసీ కొత్త లోగో అంటూ ప్రచారం జరుగుతున్నది ఫేక్​ లోగో అని వెల్లడించారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొత్త లోగోను సంస్థ త్వరలో రూపొందిస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు.  

కొణతం దిలీప్​తో పాటు మరొకరిపై కేసు

ఆర్టీసీకి సంబంధించి ఫేక్​లోగోను సృష్టించిన వారిపై కేసు నమోదైంది. టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్టీసీ అధికారులు గురువారం చిక్కడపల్లి పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఫిర్యాదు చేశారు. టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్టీసీ  ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోగోను క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్  కొణతం దిలీప్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.