ఎంఎల్ఎం సంస్థలపై లా ఎన్ ఫోర్స్మెంట్ దృష్టి పెట్టాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ఎంఎల్ఎం సంస్థలపై లా ఎన్ ఫోర్స్మెంట్ దృష్టి పెట్టాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్: మోసపూరిత ఎంఎల్ఎం సంస్థలపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దృష్టి సారించాలని ఆర్టీసీ ఎండీ సజ్జ నర్ విజ్ఞప్తి చేశారు. ఎంత చెబుతోన్న డెరెక్ట్ సెల్లింగ్ ముసుగులో గొలుసుక ట్టు మోసాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. చాపకింద నీరులా క్యూనెట్ తరహా దందాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఓ యువ చార్టర్డ్ అకౌంటెంట్, దుర్మార్గపు సంస్థ క్యూనెట్ వలలో చిక్కుక్కున్నాడని వివరించారు.

అధిక డబ్బుకు ఆశపడి రూ.8 లక్షలను సమర్పించుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తన దృష్టి తీసుకువచ్చాడని తెలిపారు. అతడు న్యాయం చేయాలని ఇటీవల తనను కలిశాడని గుర్తు చేశారు. ఆ చార్ట ర్డ్ అకౌంటెంట్ మాదిరిగా ఎంతో మంది మోసపోయామని ట్విట్టర్లో సందేశాలు పంపిస్తున్నారని చెప్పొకొచ్చారు. ఈ ఘట నలపై సుమోటోగా కేసు నమోదు చేసి బాధ్యులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.