ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ..ప్రయాణికులకు ఆర్టీసీ ఆఫర్

ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ..ప్రయాణికులకు ఆర్టీసీ ఆఫర్
  • హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు ఆర్టీసీ ఆఫర్
  • పెట్రోల్, డీజిల్ కొరత పుకార్ల నేపథ్యంలో 
  • నిర్ణయం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ పుకార్లు వ్యాపించడం, బంక్​ల వద్ద పెద్ద సంఖ్యలో వాహనదారులు ఇబ్బంది పడుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలోని ఏసీ, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి బుధవారం ప్రకటించారు. బైకులు, కార్లపై ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఈ ఆఫర్​ను వినియోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణంతో సమయం, ఇంధనం.. రెండూ ఆదా అవుతాయని పేర్కొన్నారు. రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని, కాలుష్యం నుంచి కూడా దూరంగా ఉండొచ్చని తెలిపారు.