గ్రేటర్​ ఆర్టీసీ కీలక నిర్ణయం తగ్గనున్న బస్సుల ఫ్రీక్వెన్సీ రేపటి నుంచి అమలులోకి

గ్రేటర్​ ఆర్టీసీ కీలక నిర్ణయం తగ్గనున్న బస్సుల ఫ్రీక్వెన్సీ రేపటి నుంచి అమలులోకి

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలు దంచికొడుతుండడంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బస్సుల ఫ్రీక్వెన్సీని తగ్గించాలని నిర్ణయించింది. ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం తర్వాత గ్రేటర్​పరిధిలో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేసేవారి సంఖ్య తగ్గింది. జనం అత్యవసరమైతే తప్ప పెద్దగా బయటికి రావడం లేదు. 

జర్నీలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో బస్సుల ఫ్రీక్వెన్సీని తగ్గించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ గ్రేటర్​హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బస్సులు యథావిధిగా తిరుగుతాయని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో మాత్రమే సర్వీసులను తగ్గిస్తున్నామని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 17వ తేదీ నుంచి కొత్త నిర్ణయం అమలులోకి వస్తుందన్నారు. ఎండల తీవ్రత తగ్గే వరకు కొనసాగుతుందన్నారు.