ఆర్టీసీ బకాయిలు ఇప్పట్లో ఇవ్వకపోవచ్చు!

ఆర్టీసీ బకాయిలు ఇప్పట్లో ఇవ్వకపోవచ్చు!

బాండ్ గడువు తీరినా.. పైసలిస్తలేరు

రెండు నెలలుగా ఆర్టీసీ వర్కర్ల ఎదురుచూపులు

రెండేండ్ల ఏరియర్స్​ బదులు బాండ్ల జారీ

ఫండ్స్​లేవు.. ఇప్పట్లో ఇవ్వకపోవచ్చునని సిగ్నల్స్​​ 

ఆసిఫాబాద్ వెలుగు: ఆర్టీసీ ఎంప్లాయిస్​కు, వర్కర్లకు జీతాల బకాయిల కింద ఐదేండ్ల కింద బాండ్లు ఇచ్చారు. ఈ బాండ్ల మెచ్యూరిటీ గడువు ముగిసి రెండు నెలలైనా చేతికి పైసలు అందలేదు. ఒక్కో కార్మికుడికి  దాదాపు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు బాండ్ల మీద రావాల్సిఉంది. కరోనా కష్టకాలంలో ఈ పైసలు అక్కరకొస్తయని ఎదురుచూస్తుంటే.. ఇప్పుడు డబ్బుల్లేవని మేనేజ్​మెంట్​ చేతులెత్తేసింది.  కార్పొరేషన్​లో యూనియన్లు రద్దు కావడంతో  గట్టిగా అడిగే వారు కూడా లేకుండా పోయారు.

తెలంగాణ ఏర్పడి.. టీఆర్​ఎస్​ కొత్తగా పవర్​లోకి వచ్చిన తర్వాత 2015లో ఆర్టీసీ కార్మికులకు 44 శాతం  జీతాలు పెంచింది. పెరిగిన జీతాలు 2013 ఏప్రిల్1​ నుంచి అమలు లోకి వస్తాయని సర్కారు ప్రకటించింది. కార్పొరేషన్​ దగ్గర అప్పుడు ఫండ్స్​ లేకపోవడంతో 2013 ఏప్రిల్​ నుంచి 2015 మే వరకు పెరిగిన జీతాల బకాయిలను బాండ్ల రూపంలో ఇచ్చింది. 8.5 శాతం వడ్డీతో ఐదేండ్ల తర్వాత చెల్లించేలా ఈ బాండ్లను జారీ చేసింది. రెండేళ్ల కాలానికి పెంచిన జీతాలకు సంబంధించి ఒక్కో కార్మికుడికి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు రావాల్సిఉంది. బాండ్ల గడువు ముగియగానే వారు డిపోల్లో ఆఫీసర్లను కలిసి అడిగితే  తమకేం తెలియదన్న రిప్లై వచ్చింది. పైఆఫీసర్లను అడిగితే ఇప్పట్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చునని చెప్తున్నారు. ఒక విధంగా మేనేజ్​మెంట్ ​బాండ్లను క్యాష్​ చేయడం సాధ్యం కాదన్న సిగ్నల్స్​ ఇచ్చింది.  కరోనాతో బస్సులు బందై డ్యూటీలు లేక, సరిగా జీతాలు రాక ఇబ్బందులు పడ్డ వర్కర్లు ఈ బాండ్ల మీద  పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఖర్చులకు, పిల్లల చదువులకు పనికొస్తాయనుకున్న వారికి నిరాశే మిగులుతోంది.  ఆఫీసర్లు పట్టించుకోక పోవడం, యూనియన్లు రద్దు కావడం, వాటి ప్లేస్​లో ఏర్పాటైన వెల్పేర్​ కమిటీలు ఉన్నాయోలేదో అన్నట్టుగా మారడంతో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమైతలేదని  వర్కర్లు వాపోతున్నారు.

బాండ్ ఉండీ ఫాయిదా లేదు
ఏరియర్స్ కు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన బాండ్ల గడువు ముగిసినా ఇంకా పైసలిస్తలేరు. బాండ్ ఉండి కూడా అవసరానికి పనికొస్తలేదు.
ఐదేండ్ల నుంచి బాండ్లను దాసుకున్నం. అయినా.. ఏం ఫాయిదా లేకుంటైంది.
మినహజోద్దిన్, కండక్టర్, ఆసిఫాబాద్

ఎదురుచూస్తున్నం
మాకు కార్పొరేషన్ ఇవ్వాల్సిన ఏరియర్స్ జాడ ఇప్పటి వరకు లేదు. ఎప్పుడు పైసలిస్తరో ఎవరూ కరెక్టు గా చెప్తలేరు. బాండ్లు భద్రంగా ఉంచినం. జల్ది ఇస్తే
బాగుండు.
– జాడి లక్మణ్, కండక్టర్, ఆసిఫాబాద్

For More News..

బర్త్​డే నాడే.. బావిలో శవమైన టెన్త్ విద్యార్థి

సింగరేణిలో కిరాయి బండ్ల బినామీ దందా

రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్​తో గందరగోళం.. పొద్దంతా సర్వర్‌‌ తిప్పలు

60 ఏళ్లు దాటిన రైతులకు 3వేల పెన్షన్​ ఇచ్చే ఆలోచనలో కేంద్రం