
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆగం చేశారని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ లోని లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ఆర్టీసి కార్మికుల ధర్నా చేపట్టారు. ఆర్టీసీలో ఎన్నికలు జరిపించడం, అధికారుల వేధింపులు ఆపడం సహా పే స్కేల్ జరిపి 6 డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. డబుల్ డ్యూటీ చేయించుకుని ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బస్సులను తగ్గించి, ఉద్యోగులను తీసుకోవడం మానేశారు
బస్సులను తగ్గించి, ఉద్యోగులను తీసుకోవడం మానేశారని ఆర్టీసీ కార్మికులు అన్నారు. కేసీఆర్ ఒక్కరోజు అన్నంపెట్టి మమ్మల్ని ఆగం చేశారని సీరియస్ అయ్యారు. ఆర్టీసీ కార్మికులను రవాణాశాఖా మంత్రి అస్సలు పట్టించుకోవడంలేదని.. ఒక్క ఇంట్లో నలుగురు లక్షల జీతాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం పేరుతో అడ్డంగా దోచుకున్నారని.. ప్రజల కోసం నడిచే ఆర్టీసీని ఆగం చేస్తున్నరని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.