
మహారాష్ట్రలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నిర్వహించిన ఓ మండలస్థాయి సమావేశం రచ్చరచ్చ అయింది. అమరావతి జిల్లాలో సోమవారం ఉదయం ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్రస్థాయి నేత సందీప్ తాజ్నే సహా.. మరికొందరు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ పూర్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. మొత్తం ఓట్లలో 1 శాతం ఓట్లు కూడా పొందలేకపోయింది. దీంతో.. కార్యకర్తలు కోపంతో రగిలిపోయారు. పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్న రివ్యూ మీటింగ్ లో వారిపై కుర్చీలు విసిరి తరిమికొట్టారు.
సందీప్ తాజ్నే మొన్నటి ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి చాలా సభల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు.. మిగతా లీడర్లందరిపై కుర్చీలు విసిరారు వర్కర్లు. మొదటిసారి కుర్చీ విసిరినప్పుడు లీడర్లు ఏమాత్రం భయపడలేదు. మళ్లీ మళ్లీ విసరడంతో.. సీట్లో నుంచి లేచి వెళ్లబోయారు. కార్యకర్తలు వారి అంగీలు చింపి… దాడి చేశారు. బతుకు జీవుడా అనుకుంటూ పరుగెత్తిపారిపోయారు నాయకులు.
#WATCH: A ruckus broke during a review meeting of Bahujan Samaj Party (BSP) in Amravati. #Maharashtra (17 June) pic.twitter.com/S3ut5zNKXv
— ANI (@ANI) June 18, 2019