రుద్రంగి వైలెంట్​ ఫ్యామిలీ డ్రామా

రుద్రంగి వైలెంట్​ ఫ్యామిలీ డ్రామా

జగపతిబాబు ముఖ్య పాత్రలో అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన చిత్రం ‘రుద్రంగి’. మమత మోహన్ దాస్, విమల రామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కీలక పాత్రలు పోషించారు.  రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం జులై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  జగపతిబాబు మాట్లాడుతూ ‘డైరెక్టర్ కథ చెప్పిన విధానం, తనలోని కాన్ఫిడెన్స్ నచ్చి ఈ సినిమా చేశా. కచ్చితంగా కల్ట్ సినిమా అవుతుంది. అందరూ అనుకున్నట్టు పోరాటాల సినిమా కాదు. వైలెంట్ ఫ్యామిలీ డ్రామా. ఇందులోనూ విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే నటించా.. కానీ అందరికీ నచ్చుతానని నమ్ముతున్నా. 

‘లెజెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ తర్వాత నాకు  సెకెండ్ ఇన్నింగ్స్ మొదలైంది అన్నారు. ఈ మూవీతో నేను థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నా’ అన్నారు. అజయ్ మాట్లాడుతూ ‘తెలంగాణ కల్చర్ అంటే మందు చుక్క, మటన్ ముక్క, నల్లి బొక్క అని ఇటీవల సినిమాల్లో చూపిస్తున్నారు. కానీ వెనక్కు వెళ్లి చూస్తే.. కొన్ని వేల, లక్షల, కోట్ల రక్తపు చుక్కల త్యాగాలు ఉన్నాయి. తెలంగాణ వాస్తవ చరిత్రలో జరిగిన కొన్ని పాత్రలను గుర్తించి చేసిన కథ ‘రుద్రంగి’. తెలుగులో రెస్పాన్స్ బట్టి.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తాం’ అని చెప్పారు. ప్రేమకు, వాంఛకు మధ్య జరిగిన యధార్థ  ప్రేమ కథే ఈ సినిమా అని రసమయి బాలకిషన్ చెప్పారు.