‘ఇదే నా లాస్ట్ మెసేజ్’ అంటూ కనిపించకుండా పోయిన ఎస్సై

‘ఇదే నా లాస్ట్ మెసేజ్’ అంటూ కనిపించకుండా పోయిన ఎస్సై

కర్నూలు జిల్లా పోలీసు వాట్సప్ గ్రూప్ లో ఓ ఎస్సై పెట్టిన పోస్టు కారణంగా డిపార్ట్ మెంట్ లో కలకలం రేగింది. శనివారం రాత్రి ఇదే నా లాస్ట్ మెసేజ్ అంటూ ఓ పోస్ట్ పెట్టి ఆచూకీ లేకుండా పోయాడు రుద్రవరం యస్ ఐ విష్ణు నారాయణ.

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని  ఎస్సై విష్ణు నారాయణ కి పనిష్మెంట్ ఇచ్చారు జిల్లా ఎస్పీ కె.ఫక్కీరప్ప.  పనిష్మెంట్  క్రింద రెండు రోజుల పాటు పరేడ్ గ్రౌండ్ లో డ్రిల్ కు రావాలని విష్ణు నారాయణ తో పాటు సీఐ శ్రీధర్, అస్పరి ఎస్సై నాగేంద్ర  లను ఎస్పీ కె.ఫక్కీరప్ప ఆదేశించారు.దీంతో మనస్తాపం చెందిన విష్ణు శనివారం వాట్సాప్ గ్రూప్ లో..ఇదే చివరి మెసేజ్ అంటూ పోస్ట్ చేసి కనిపించకుండా పోయాడు.

అయితే మొదటి నుండి విష్ణు నారాయణ ఎస్ ఐ వివాదాస్పద పోలీసు గా గుర్తింపు పొందాడని, అతనిపై గతం లో కూడా పలు కేసులున్నాయని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. విష్ణు నారాయణ కడప జిల్లా మైదుకూరు మండలం బ్రహ్మం గారిమఠం వద్ద ఉన్నాడని, ఆళ్ళగడ్డ  డీఎస్పీ పోతురాజు కు ఫోన్ చేసి, తానే ఆళ్లగడ్డ డీఎస్పీ ఆఫీస్ కు వస్తున్నట్లు సమాచారం.