‘‘చిన్న సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందినప్పుడే సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది” అన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. ‘రుక్మిణి’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియాంక, దీప్తి శ్రీరంగం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి సింహాచలం గుడుపూరి దర్శకుడు. నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ వంటి ఎన్నో హిట్ మూవీస్‌కు గంగాధర్ నాతో కలిసి వర్క్ చేశాడు. నాకు మంచి స్నేహితుడైన ఆయన నిర్మించిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పారు. హారర్ కామెడీ జానర్‌లో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని, సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేయబోతున్నామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.
హీరో నిరంజన్ మాట్లాడుతూమా “రుక్మిణి” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి థ్యాంక్స్. మా యంగ్ టీమ్ అంతా కలిసి ఒక మంచి మూవీ చేస్తున్నాం. హారర్ కామెడీ జానర్లో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా “రుక్మిణి” సినిమా ఉంటుంది. సంక్రాంతికి టీజర్తో మీ ముందుకు వస్తాం. మా టీమ్కు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
