వ్యాక్సిన్​ వేస్తమంటే నదిలో దూకారు!

వ్యాక్సిన్​ వేస్తమంటే నదిలో దూకారు!

కొవిడ్​ వ్యాక్సిన్​ కోసం దేశంలో చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ, ఉత్తరప్రదేశ్​ రాష్ర్టంలోని బారాబంకి అనే ఊళ్లో పరిస్థితి మాత్రం కాస్త డిఫరెంట్​గా ఉంది. ఫ్రీగా వ్యాక్సిన్​ వేస్తామంటే ఊరిజనం పారిపోతున్నారు! తప్పించుకునే దారిలేక సరయు నదిలో దూకి... పారిపోయారు. మొన్న శనివారం రోజు వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ ​ప్రోగ్రామ్​లో భాగంగా  బారాబంకి గ్రామంలో టీకాలు వేయడానికి పోయారు. టీకాలు వేయించు కోవడానికి అందరూ రావాలని వాళ్లు ప్రచారం చేయించారు. ‘నిజం చెప్పులు తొడక్కముందే అబద్ధం ఊరంతా తిరిగొచ్చినట్టు’ టీకాల పేరుతో విషం ఇస్తారనే పుకారు ఊరంతా షికారు చేసింది. దాంతో.. అధికారుల కంటబడితే విషం ఎక్కిస్తారనే భయంతో ఊరి జనాలు పరుగందుకున్నారట. తప్పించుకునే దారిలేక నదిలోకి దూకిన అమాయక జనం చేసిని నిర్వాకం తెలుసుకున్న అధికారులు తలలు పట్టుకున్నారట. రెవెన్యూ అధికారులు కలుగ జేసుకుని గ్రామస్తుల్లో వ్యాక్సిన్​ పనితీరు గురించి అవగాహన కల్పించారు. అంత చేసినా ఆ ఊళ్లో 14 మంది మాత్రమే వ్యాక్సిన్​ వేయించుకున్నారు.