స్వతంత్య్ర భారతదేశంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం రూ. 2 లక్షలు రుణమాఫీ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులను రుణ విముక్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. రుణమాఫీ విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. వివిధ కారణాలతో రుణమాఫీ జరగని రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుందన్నారు.. ఈ సారి నుంచి సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. డేటా క్లియర్ గా ఉన్న వారికి ఇప్పటికే రుణమాఫీ చేశామన్నారు.
రైతుల మేలుకోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదన్నారు. రుణమాఫీపై రైతులను గందరగోళపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు, గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం క్రాప్ ఇన్స్యూరెన్స్ లేకుండా చేసిందన్నారు, గత ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులనే ఆదుకోమన్నా.. ఆదుకోలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు.రుణమాఫీ కోసం ఆధార్ సవరణలను చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
