రన్నింగ్ కారులో మంటలు

రన్నింగ్ కారులో మంటలు

రంగారెడ్డి జిల్లా బాట సింగారం విజయవాడ జాతీయ రహదారిపై రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. కారులో నుంచి ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.  దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు ..కారును పక్కకు ఆపి, వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆదుపు చేశారు. అప్పటికే కారు  మంటల్లో దగ్ధమైంది.  షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ఫైర్ సిబ్బంది తెలిపారు.   

కారులో మంటలు చెలరేగడంతో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.