న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం19 పైసలు లాభపడి రూ.89.96 వద్ద ముగిసింది. డాలర్ ఇండెక్స్ పడిపోవడం, ఆర్బీపై జోక్యంతో కోలుకుంది. బుధవారం ఇది 90 పైసలు పతనమై రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సెషన్ ప్రారంభంలో రూ.90.43 వద్ద సరికొత్త కనిష్ట స్థాయిని తాకింది. విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐలు) అమ్మకాలు, పెరుగుతున్న క్రూడ్ ధరలు ఇందుకు కారణం. ఇండో–-యూఎస్ వాణిజ్య ఒప్పందం ప్రకటనలో జాప్యం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచింది.
అయితే అమెరికన్ నాన్-ఫార్మ్ పేరోల్ డేటా అంచనా కంటే తక్కువగా రావడంతో డాలర్ బలహీనపడింది. దీంతో రూపాయికి మద్దతు దొరికింది. ఈ విషయమై చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, రూపాయి పతనం ద్రవ్యోల్బణం, ఎగుమతులను ప్రభావితం చేయబోదని అన్నారు. వచ్చే ఏడాది పరిస్థితి బాగుంటుందని చెప్పారు. రూపాయి విలువ తగ్గడం వల్ల ఎగుమతిదారులకు అధికం ఆదాయం వస్తుంది కానీ దిగుమతుల ఖర్చును పెంచుతుంది.
