సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలి : అబ్దుల్లా

సర్వీసులో ఉన్న టీచర్లకు  టెట్ నుంచి మినహాయింపునివ్వాలి : అబ్దుల్లా
  • ఆర్​యూపీపీటీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా 

హైదరాబాద్, వెలుగు: సర్వీసులో ఉన్న టీచర్లకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్​యూపీపీటీ) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్​లో ఆర్​యూపీపీటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

 ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దాదాపు 45 వేల మంది టీచర్ల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, వారికి ఊరట కల్పించాలని ఆయన కోరారు. ఒకవేళ టెట్‌‌ను అనివార్యంగా అమలు చేయాల్సి వస్తే, భాషోపాధ్యాయులకు వారి సబ్జెక్టుకు అనుగుణంగా ప్రత్యేకంగా పేపర్– 3 నిర్వహించాలని కోరారు.