పల్లెల అభివృద్ధికే పనుల జాతర : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

పల్లెల అభివృద్ధికే పనుల జాతర : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
  • రూరల్‌‌‌‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి 

నిజామాబాద్‌‌‌‌, వెలుగు :  గ్రామాల అభివృద్ధి కోసమే పనుల జాతర చేపట్టామని రూరల్‌‌‌‌ ఎమ్మెల్యే డాక్టర్‌‌‌‌ భూపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం డిచ్‌‌‌‌పల్లి మండలం ముల్లంగి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పనులకు కాంగ్రెస్​సర్కార్‌‌‌‌ నిధులు అందిస్తుందన్నారు. రూరల్‌‌‌‌ నియోజకవర్గంలో 33 అంగన్‌‌‌‌వాడీ భవనాలు నిర్మిస్తున్నామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇంటి నిర్మాణ ఖర్చు పెంచుకోవద్దుకలెక్టర్‌‌‌‌ వినయ్‌‌‌‌కృష్ణారెడ్డి 

అర్హులను గుర్తించి డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌ ఇండ్లు కేటాయిస్తామని కలెక్టర్‌‌‌‌ వినయ్‌‌‌‌కృష్ణారెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణ ఖర్చులు పెంచుకోవద్దని సూచించారు. ‘భూభారతి’ దరఖాస్తులను పరిష్కరిస్తామని, కోర్టు ఆదేశాల మేరకు సాదాబైనామాలు సెటిల్‌‌‌‌ అవుతాయన్నారు. మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ ముప్ప గంగారెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్‌‌‌‌, డీపీవో శ్రీనివాస్‌‌‌‌రావు పాల్గొన్నారు.