సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్​ రూరల్, వెలుగు:  కాంగ్రెస్​ పాలనలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం మోపాల్ మండలంలో పర్యటించారు. కులాస్​పూర్  పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన అనంతరం  మోపాల్​ మండల కేంద్రంలో కురుమ సంఘం భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 

మంచిప్ప గ్రామంలో నిర్మించిన హెల్త్​ సెంటర్​ను ప్రారంభించి మాట్లాడారు.  ప్రజా సంక్షేమం, అభివృద్ధే ద్యేయంగా కాంగ్రెస్​ సర్కార్​పని చేస్తుందన్నారు.  ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఒర్వలేక  విషపు ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు నమ్మొద్దన్నారు.  రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి  ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు మోహన్​రెడ్డి, రాజేశ్, సాయిరెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.