గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌‌‌‌ వైపే : చైర్మన్‌‌‌‌ పటేల్ రమేశ్‌‌‌‌రెడ్డి

గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌‌‌‌ వైపే : చైర్మన్‌‌‌‌ పటేల్ రమేశ్‌‌‌‌రెడ్డి
  •     టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్​ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు: గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌‌‌‌ పార్టీని ఆదరిస్తున్నారని, అందుకు ఇటీవల వచ్చిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని టూరిజం డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పటేల్​ రమేశ్‌‌‌‌రెడ్డి అన్నారు.

సోమవారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం 117 జీపీలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 69 మంది గెలిచారన్నారు. ఇండిపెండెంట్లలోనూ ఎక్కువమంది కాంగ్రెస్ రెబల్స్‌‌‌‌గా పోటీ చేసి గెలిచినవారేనన్నారు. 

రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడుతున్నారు. గత బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో పేదలకు ఒక ఇంటిని కూడా ఇవ్వలేదన్నారు. జూబ్లీహిల్స్ సహా జీపీ ఎన్నికల్లోనూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ప్రజలు తిరస్కరించారని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 90శాతానికి పైగా కాంగ్రెస్ లీడర్లు విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులందరికీ కాంగ్రెస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, కాంగ్రెస్ రెబెల్స్‌‌‌‌ గా పోటీ చేసి గెలిచిన వారందరూ తిరిగి పార్టీలోకి రావాలని సూచించారు.