బాహుబలి రసెల్ : IPL సెన్సేషన్

బాహుబలి రసెల్ : IPL సెన్సేషన్

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో మ్యాచ్ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్, కరీబియన్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ పేరు… ఆన్ లైన్ సెన్సేషన్ గా మారిపోయింది. మొన్నటి మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లను ఊచ కోత కోస్తూ.. 13 బంతుల్లోనే 48 రన్స్ చేసి.. అసాధ్యమనుకున్న విజయాన్ని కోల్ కతాకు అందించి… యావత్ క్రికెట్ ప్రపంచానికే షాకిచ్చాడు రసెల్. దీంతో… ఆండ్రీ రసెల్ పై దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రన్ రేట్ ఎంతున్నా.. రసెస్ ఆట మొదలెట్టాడంటే గెలిచేదాకా వదలడు. చిన్నపిల్లల బౌలింగ్ ను చితక్కొట్టినట్టుగా కొట్టేస్తాడు అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

ప్రపంచ క్రికెట్ లో అత్యంత భయంకరమైన ప్లేయర్ గా రసెల్ మారాడని హర్షభోగ్లే చెప్పాడు.

క్రికెట్ లో డైనోసార్ లాంటి వాడు రసెల్ అని మూవీ స్టార్ రణ్ వీర్ సింగ్ అన్నాడు.

ఎక్కడేసినా కొడుతున్నాడు.. ఇంకెక్కడ బాల్ వేయమంటావ్ అని బ్రెండన్ మెక్ కల్లమ్ ఆశ్చర్యంగా చెప్పాడు.

కేకేఆర్ టీమ్ కు రసెల్.. మిలియన్ డాలర్ అంత విలవైన వాడని స్టార్ ప్లేయర్ క్రిస్ లిన్ అన్నాడు.

వీళ్లందరినీ మించి కామెంట్ కాకుండా.. ఓ ఫొటో పెట్టాడు కేకేఆర్ ఫ్రాంచైజీ ఓనర్ షారుక్ ఖాన్. అదే బాహుబలి గెటప్ లో ఆండ్రీ రసెల్ ఉన్న ఫొటో. మీరు ఎన్ని చెప్పినా… ఈ ఫొటో ముందు అవన్నీ చిన్నవే అని షారుక్ అన్నాడు.

బాహుబలి సినిమా టీమ్ కూడా ఈ ఫొటోను రీట్వీట్ చేసింది.

ఈ టోర్నీలో రసెల్ బీభత్సమైన ఫామ్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆడిన 4 మ్యాచ్ లలో 77 బాల్స్ ఫేస్ చేసిన రసెల్..207 రన్స్ చేశాడు. 22 సిక్సులు బాదాడు.