రష్యా, ఉక్రెయిన్​ మధ్య ఆహార ఎగుమతి డీల్​

రష్యా, ఉక్రెయిన్​ మధ్య ఆహార ఎగుమతి డీల్​
  • రష్యా, ఉక్రెయిన్​ మధ్య ఆహార ఎగుమతి డీల్​
  • రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం
  • అయిష్టంగానే కుదుర్చుకున్న రష్యా, ఉక్రెయిన్
  • ప్రపంచ ఆహార సంక్షోభం నుంచి ఊరట 

ఇస్తాంబుల్​: ఐదు నెలలుగా భీకరంగా పోరాడుతున్న రష్యా, ఉక్రెయిన్​మధ్య శనివారం కీలక ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఆహార సంక్షోభం నుంచి ఊరట కల్పిస్తూ రెండు దేశాలు ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం ఇదే మొదటిసారి. యుద్ధంవల్ల ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారని, రష్యా‌‌‌‌‌‌‌‌–ఉక్రెయిన్​మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో ఆకలి సమస్య కొంతైనా తీరుతుందని యునైటెడ్​నేషన్స్(యూఎన్) పేర్కొంది. ఈ ఒప్పందంతో ఇక గోధుమల ధరలు దిగి వస్తాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇస్తాంబుల్​లోని డోల్మబాచి ప్యాలెస్​లో యూఎన్​ సెక్రటరీ జనరల్ ​ఆంటోనియో గుటెర్రెస్​ సమక్షంలో రెండు దేశాల ప్రతినిధులు అయిష్టంగానే ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ డీల్​ను ఒక ల్యాండ్ మార్క్ గా గుటెర్రెస్​ అభివర్ణించారు. ఈ ఒప్పందం లో తుర్కియే ప్రెసిడెంట్​ రెసెప్ ​తయ్యప్ ​ఎర్డోగన్ ​కీలక పాత్ర పోషించారు. ఈ డీల్ ​శాంతికి బాటలు వేస్తుందని ఎర్డోగన్​ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఏంటీ ఎక్స్​పోర్ట్​ డీల్​?

బ్లాక్​సీలోని ఉక్రెయిన్ కు చెందిన ఒడెసా​పోర్టులో 20 మిలియన్​టన్నుల ధాన్యంతో పాటు ఇతర ధాన్యం నిల్వలను రష్యా యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి. ఈ ధాన్యాన్ని బ్లాక్​సీ మీదుగా ఉక్రెయిన్​రవాణా చేసేందుకు తాజా ఒప్పందం వీలు కల్పిస్తుంది.

గంటల్లోనే  బ్రేక్ చేసిన రష్యా​

ఆహారధాన్యాల ఎగుమతి ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించింది. ఈ డీల్​ కుదిరిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్​కు చెందిన ఒడెసా పోర్టుపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఆహారధాన్యాల ఎగుమతికి సహకరిస్తామని, తాము స్వాధీనం చేసుకున్న పోర్టులను తిరిగి తెరుస్తామని ఒప్పందం సమయంలో తాను ఇచ్చిన హామీని రష్యా బ్రేక్​ చేసింది. బ్లాక్​ సీలోని ఒడెసా పోర్టుపై రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్​ మిలిటరీ పేర్కొంది. ‘‘కాలిబర్​ క్రూయిజ్​ మిస్సైళ్లతో శత్రు దేశం ఒడెసా పోర్టుపై దాడి చేసింది. అయితే ఆ దేశానికి చెందిన రెండు మిస్సైళ్లను మా డిఫెన్స్​ ఫోర్సులు కూల్చిపారేశాయి” అని ఉక్రెయిన్ ​ఆర్మీ తెలిపింది. కాగా ఈ డీల్​ను పుతిన్​ బ్రేక్ ​చేయవచ్చని బ్రిటన్​ ఫారెన్ ​సెక్రటరీ లిజ్ ​ట్రుస్ ​ఇంతకుముందే అనుమానం వ్యక్తంచేశారు.