నాసాతో రష్యా భాగస్వామ్యం 2024 వరకే...

నాసాతో రష్యా భాగస్వామ్యం 2024 వరకే...

గత కొన్నేళ్లుగా ఐఎస్ఎస్ లో అమెరికాతో కీలక భాగస్వామిగా ఉన్న రష్యా 2024 తర్వాత తాము భాగస్వామ్యం నుంచి వైదొలగుతామని వెల్లడించింది. ఈ మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ ప్రకటన చేశారు. ఉక్రెయిన్ తో యుద్దం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల గురించి తెలిసిందే. కాగా వీటికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాసా కీలక విషయాన్ని తెలిపింది. రష్యా సొంతంగా 2028లో రోస్ అనే పేరుతో అంతరిక్షంలో ఓ కొత్త స్పేస్ ఔట్ పోస్టును నిర్మించాలనుంటోందని చెప్పింది. అప్పటి వరకు తాము ఐఎస్ఎస్ లో భాగంగా ఉంటామని రష్యా అధికారులు తమకు తెలిపారని నానా వెల్లడించింది. అప్పటివరకూ పోస్కో స్మోన్ తో సంబంధాలు మునుపటిలాగే ఉంటాయని పేర్కొంది.

భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష పరిశోధనల కోసం ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ ను నిర్మించారు. ఈ ఐఎస్ఎస్ నిర్మాణంలో అమెరికాతో పాటు జపాన్, కెనడా లాంటి మరో 11 యూరోపియన్ దేశాలు కూడా పాలుపంచుకున్నాయి. అయితే ఇటీవల రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు మారాయి. అమెరికా, రష్యా బద్ద శత్రువులుగా మారాయి. దీంతో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తోన్న ఐఎస్ఎస్ భాగస్వామ్యం నుంచి 2024 తర్వాత తాము వైదొలగుతామని రష్యా స్పష్టం చేసింది.