గూగుల్​కు 32 వేల డాలర్ల ఫైన్ రష్యా కోర్టు ఆదేశాలు

గూగుల్​కు 32 వేల డాలర్ల ఫైన్ రష్యా కోర్టు ఆదేశాలు

మాస్కో: గూగుల్​కు రష్యా కోర్టు గురువారం 3 మిలియన్ల రూబుల్స్ (32,000 యూఎస్​డాలర్లు) ఫైన్​ విధించింది. ఉక్రెయిన్ ​యుద్ధానికి సంబంధించి ఫేక్ ​వీడియోలను తొలగించడంలో గూగుల్​ విఫలమైందని కోర్టు ఆరోపించింది. ఈ నెల ప్రారంభంలో యాపిల్, వికీమీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వికీపీడియాపై కూడా మేజిస్ట్రేట్​ కోర్టు ఈ చర్యలు తీసుకుంది. తాజాగా సెర్చ్ ఇంజిన్ ​దిగ్గజం గూగుల్​పై కోర్టు చర్యలు తీసుకుంది. రష్యా న్యూస్ ​నివేదికల ప్రకారం.. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ ​వీడియో సర్వీస్​లో రష్యా‌‌‌‌–ఉక్రెయిన్​ యుద్ధానికి సంబంధించిన ఫేక్​ వీడియోలు ఉన్నాయి. వీటిని తొలగించకపోవడంతో కోర్టు గూగుల్​ను దోషిగా తేల్చింది. వీడియోలను తొలగించకుండా, మైనర్లు ఓపెన్​ చేయకుండా తగిన చర్యలు తీసుకోవడంలో గూగుల్ విఫలమైందని న్యూస్​ ఏజెన్సీలు తెలిపాయి. కాగా, ఉక్రెయిన్ పై దాడిని ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్​గా రష్యా వ్యవహరిస్తోంది.