రన్ వేపై కాదు.. గడ్డకట్టిన నదిపై దిగింది!

రన్ వేపై కాదు.. గడ్డకట్టిన నదిపై దిగింది!

రన్ వేపై దిగాల్సిన విమానం పైలట్ తప్పిదం కారణంగా గడ్డ కట్టిన నదిపై ల్యాండ్ అయింది. పోలార్ ఎయిర్ లైన్స్ కు చెందిన సోవియెట్ కాలం నాటి ఆంటోనోవ్ 24 విమానం గురువారం రష్యాలోని యకుటియాలోని జిర్యాంక ఎయిర్ పోర్టులో దిగాల్సి ఉంది. అయితే, ఈ ఎయిర్ పోర్టులోని రన్ వేపై  మంచు పేరుకుపోయింది. పక్కనే ఉన్న కొలిమా నది కూడా పూర్తిగా గడ్డ కట్టింది. దీంతో పైలట్ గందరగోళానికి లోనయ్యి గడ కట్టిన నదిపై విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 30 మంది ప్రయాణికులు ఉండగా, అందరూ సేఫ్ గా బయటపడ్డారు.