భారత్లో పుతిన్ పర్యటన..ముహూర్తం ఫిక్స్!

భారత్లో పుతిన్ పర్యటన..ముహూర్తం ఫిక్స్!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. రష్యా చమురు కొనుగోలు, అమెరికా భారత్ పై విధించిన సుంకాలు, భారత్, రష్యా మధ్య సంబంధాల బలోపేతం చేసేందుకు పై డిసెంబర్ నెలలో పుతిన్ భారత్ లో పర్యటిస్తారని శుక్రవారం (ఆగస్టు 29) క్రెమ్లిన్ అధికారిక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ధృవీకరించారు.  తేదీలు ఇంకా ఖరారు  కాలేదు. 

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనను ధృవీకరించారు.అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అజిత్ దోవల్ రష్యాను సందర్శించిన సందర్భంలో ఈ విషయాన్ని తెలిపారు. 

అమెరికా-భారతదేశం ఉద్రిక్తతలు:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అదనపు సుంకాలు విధించిన సమయంలో అజిత్ దోవల్ రష్యాలో పర్యటించారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం అమెరికాకు ఇష్టం లేకపోవడంతో ఈ ఉద్రిక్తతలు తలెత్తాయి. 

భారత్, రష్యాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. రక్షణ, ఇంధనం, అంతరిక్ష పరిశోధన, అణు విద్యుత్ వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య బలమైన సహకారం ఉంది. పుతిన్ పర్యటన ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు.